Google

Saturday, December 30, 2006

ఒడ్డునపడ్డ చేప

నీ నుదుట సిందూరం చూస్తుంటే
జాబిల్లినిసూరీడు ముద్దాడినట్లనిపిస్తుంది!

ఆ లేతని చెక్కిళ్ళని తాకినప్పుడల్లా
విరబూసిన గులాబిరెమ్మల నునుపుదనం గుర్తొస్తుంది!

ఎర్రని పెదాలపై నీ నవ్వు కనిపించినప్పుడు
మకరందాల మందారం వికసించినట్లనిపిస్తుంది!

యిక యిన్ని అందాలు నిండిన నిన్ను
ఆసాంతం చూస్తేనో
నాకు ఒడ్డునపడ్డ చేప నీటికోసం తల్లడిల్లినట్లుంటుంది!

1 comment:

Bolloju Baba said...

నాకు ఒడ్డునపడ్డ చేప నీటికోసం తల్లడిల్లినట్లుంటుంది!
ఈ వాక్యం నాకు రెండు రకాలుగా అర్ధమవుతుంది.
1. కవితలోని స్త్రీ ఒడ్డున పడ్డ చేప లా తల్లడిల్లటం
2. కవి ఒడ్డున పడ్డ చేప లా తల్లడిల్లటం

ఈ రెంటిలో మీ భావనేది.
లేక నేనేమైనా పొరపడుతున్నానా.
బొల్లోజు బాబా