చాన్నాళ్ళకి చూసా నిన్నీ రోజు.
కళ్ళకి కన్నీళ్ళు అడ్డొచ్చాయో ఏమో..?
మసక మసకగా కనిపించావు
మబ్బు చాటు చందమామలా!
అయినా కాసింత దగ్గర్లోనే
తచ్చాడుతున్నా
కనీసం కళ్ళతోనైనా
నీ వదనాన్ని తడమాలని.
అంత దూరంలోంచి చూస్తున్నా
నీలో ఎంత మార్పు....
నాకు దొరకని సుఖమేదో,
నన్నొదిలేసిన ఆనందమేదో,
నీలో స్పష్టంగానే కనిపిస్తున్నాయి.
నీ పెదాలపై
మునుపటి నవ్వు లేదు.
ఉన్నా అది నన్ను పులకరింపజేసిన
నవ్వు కాదు.
ఆ నవ్వు
దప్పిగొన్న బాటసారి
దారి తెన్నూ లేక నడుస్తుంటే,
ఎదురొస్తున్న ఎండమావులు
ఎగతాలి చేస్తున్నట్లు....

Sunday, December 3, 2006
Posted by
వడ్లూరి కేశవా చారి
at
11:39 PM
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment