Google

Saturday, December 30, 2006

ఒడ్డునపడ్డ చేప

నీ నుదుట సిందూరం చూస్తుంటే
జాబిల్లినిసూరీడు ముద్దాడినట్లనిపిస్తుంది!

ఆ లేతని చెక్కిళ్ళని తాకినప్పుడల్లా
విరబూసిన గులాబిరెమ్మల నునుపుదనం గుర్తొస్తుంది!

ఎర్రని పెదాలపై నీ నవ్వు కనిపించినప్పుడు
మకరందాల మందారం వికసించినట్లనిపిస్తుంది!

యిక యిన్ని అందాలు నిండిన నిన్ను
ఆసాంతం చూస్తేనో
నాకు ఒడ్డునపడ్డ చేప నీటికోసం తల్లడిల్లినట్లుంటుంది!

నా డైరీ మొదటి పేజీ


Friday, December 29, 2006

నిన్ను చూస్తుంటే


నిన్ను చూస్తుంటే

యిన్నాళ్ళూ నా కళ్ళు వెతికిన అందం
కళ్ళ ముందున్నట్టుగానే వుంటుంది.

నువ్వు నవ్వుతుంటే
పరిమళాలు నిండిన విరులన్నీ
నా ఎదనిండా జల్లుతున్నట్టుగానే వుంటుంది.


మాట్లాడితేనో
అమృతాన్ని మోసుకొచ్చిన సన్నాయి నొక్కులేవో
నన్ను చేరుతున్నట్టుగానే వుంటుంది.

కానీ; మళ్ళీ నువ్వే
ఒక్కో సారి నువ్వలా చూస్తూంటే
నా జీవితంలో యింకెన్నో అందాలు విడిచి
అర్థం లేకుండా నీతో గడిపాననిపిస్తుంది.

నువ్వలా వెకిలిగా నవ్వుతుంటే
నేను మరిచిన భవిష్యత్తు
వెక్కిరిస్తున్నట్టనిపిస్తుంది.

యిక నీ మాటలో
చచ్చిన పామునే చంపినట్టు
ఎక్కడైనా నే బతికుంటే
పొడిచి పొడిచి చంపాలన్నట్లు
కసిగా పొడుస్తున్న కత్తి పోట్లేమో అనిపిస్తుంది.
ఎందుకిలా?
ఓసారి నా జీవితంలోవెలుగులు నింపిన దేవతలా
మరోసారి నా కళ్ళను పొడిచేసి
చీకట్లను మిగిల్చిన దెయ్యంలా
క్షణక్షణం మారిపోయే కడలిలా
మరుక్షణం నే సేదతీరే ఒడిలా
ఎందుకిలా మారతావ్?
నాకు నచ్చిన,నేను మెచ్చిన
నా ప్రేయసిలా ఉండరాదూ!


Sunday, December 10, 2006

నువ్వేనా!




Wednesday, December 6, 2006

ఎందుకలా చూస్తావ్ ????


నీకు కళ్ళెందుకిచ్చాడు దేవుడు
నువ్వు చూడటానికా,లేక
నన్ను చంపటానికా.

ఎందుకలా చూస్తావ్
మెరుపుల కాంతులన్నీ కళ్ళల్లో దాచుకొని!
నీ చూపుల బాకులొచ్చి నన్ను గుచ్చుకుంటుంటే,
నేననుభవించే తీయని నరకం
నీవెరుగుదువా?

నీకేం....
ఎలాగైనా చూస్తావ్..
సూటిగా,వాలుగా,ఓరగా....

నువ్విసిరిన ఒక్కో చూపూ
వేల మెగావోల్టుల శక్తులు నింపుకొని
నా వేపుకొస్తుంటేనేనెంతగా వణికిపోతానో తెలుసా!

నిజం....నిన్న నువ్వలాగే చూసావ్..
నిముషం మాత్రమే చూసావ్.
అయితేనేం....
నాకిక నిద్రెలా పడుతుందనుకున్నావ్????

Sunday, December 3, 2006

చాన్నాళ్ళకి చూసా నిన్నీ రోజు.
కళ్ళకి కన్నీళ్ళు అడ్డొచ్చాయో ఏమో..?
మసక మసకగా కనిపించావు
మబ్బు చాటు చందమామలా!

అయినా కాసింత దగ్గర్లోనే
తచ్చాడుతున్నా
కనీసం కళ్ళతోనైనా
నీ వదనాన్ని తడమాలని.

అంత దూరంలోంచి చూస్తున్నా
నీలో ఎంత మార్పు....

నాకు దొరకని సుఖమేదో,
నన్నొదిలేసిన ఆనందమేదో,
నీలో స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

నీ పెదాలపై
మునుపటి నవ్వు లేదు.
ఉన్నా అది నన్ను పులకరింపజేసిన
నవ్వు కాదు.

ఆ నవ్వు
దప్పిగొన్న బాటసారి
దారి తెన్నూ లేక నడుస్తుంటే,
ఎదురొస్తున్న ఎండమావులు
ఎగతాలి చేస్తున్నట్లు....

నీలా మరొకరు

ఈరోజు
మళ్ళీ పొరపడ్డా..

నీ నవ్వు లోని మాధుర్యం,
నీ నడకలోని సౌందర్యం,
మాటల్లో లాలిత్యం,
ఆ చూపుల్లో అమాయకత్వం....

అంతా.. నీవనిపించే
నీలా మరొకరు!

ఓ క్షణం తీక్షణంగా చూసా,
తనను కాదు,నిన్ను
తనలో నాకు కనిపించే నిన్ను.

అంతే!
ఎదలోంచి ఎల్లువలా పొంగిన గతం!!
తనకు ఎదురెళ్ళి చూడగానే
ఆశ్చర్యం,ఆనందం
కలగలిపిన అనుభవం!!

అక్కడుంది నీవు కాదు!
నీలా అనిపించే
కాదు,కనిపించే
నీవు కాని
మరొకరు....

మల్లెమొగ్గ

ఈ రోజేంటో..!
ఆకుపచ్చ ఓణీలో
అందంగా వచ్చావ్.
వసంత కాలంలో
లేత చిగుర్లేసిన మల్లెమొగ్గలా!!

ఇప్పుడు తెలిసింది

నాకో అనుమానం.
నీ పెదాలు పలికిన ప్రతీ మాట
సన్నగా మొదలయి
నను తీయగా తాకుతున్నాయి.
ఏంటా అని గట్టిగా ఆలోచిస్తే
ఆ దేవుడు
నీ గొంతులో వీణను దాచి
పెదాలపై అమృతముంచాడని అనిపిస్తోంది
అంతే కదూ!
దొంగా దొరికిపోయావ్....

నిను చూసిన తర్వాత

నీ కళ్ళల్లో నలుపు చూసిన తర్వాత
నాకు చీకటి కూడా అందంగా కనిపిస్తోంది!
నీ పెదాలపై నవ్వు చూసిన తర్వాత
యిక ఈ పువ్వుల్లో ఏముంది అనిపిస్తోంది!!

Saturday, December 2, 2006

కుశలమా!

నే వెళ్ళొస్తూ
ఎదురొచ్చిన పిల్ల గాలికి చెప్పా,
నిన్నడిగినట్లు చెప్పమని!
తను నీకు చెప్పిందా!!

సన్నజాజి పువ్వా!

మల్లె పూవు లాంటి ఓణీలో
సన్నజాజి లా ఉన్న నిన్ను చూడగానే
నా మనసు మందారమై వికసించింది.

నువ్వుండగా జాబిలెందుకు

పట్టు లంగా పరికిణీల్లోనే
తలుక్కున మెరిసే నువ్వు
పసుపు చీర, మల్లె పూలతో వస్తే
యిక ఆ చంద్రుడు
వెన్నెలనివ్వడం మానేస్తాడో ఏమో!!!!

నిజమే కదూ!

ఎందుకో
ఈ ఏడాది అంతా బరువుగా గడిచిపొతోంది.
నీ తీపి జ్ఞాపకాలతో నిండిపోయింది కాబట్టి!
నిజమేనా!!...

అందమంతా నీవే


నిన్ను క ముందు
ఈ లోకమెంతో అందమైందనిపించింది!
నిన్ను చూసాక
ఈ లోకంలోని అందమంతా నీవేననిపిస్తోంది!!

తీపి జ్ఞాపకం

నా ఊహళ్ళో ఊపిరోసుకున్న అందమా
విడిపోతానంటూనే పెనవేసుకున్న అనుబంధమా

నన్ను ఇన్నాళ్ళూ
ఓ తీయని కాల ప్రవాహంలో ముంచేసిన నువ్వు
నిజంగానే స్వప్నమా!!

Friday, December 1, 2006

నీ నవ్వే!!

తొలి సందె కిరణాలు
ప్రసరించు సమయాన,
హిమబింధు జల్లుల్లో
తడిసేటి పుష్పాలు,

అవని ఒడినిండా రంగులన్నీ
కుంచెతోఅద్దినట్లు,
తోటలొని పూలన్నీ
చేటంతై విచ్చినప్పుడు,

ఏ పువ్వు చూసినా
నీ నవ్వే గుర్తుకొచ్చె!!

మచ్చ

కాగితానికి,కలానికి
ప్రేమ యుద్ధం జరిగింది!
కాగితం జీవితంపై
కలం మచ్చపడింది!!

హృదయం

మందార దాచుకున్న మకరందం
తుమ్మెద లాక్కెళ్ళింది!
నేను దాచుకున్న నా హృదయం
ఆ వన్నెలాడితో పారిపోయింది..!!

ఈ రోజంతా ఆనందమే!..

అందాల జాబిలికి
అందరూ చూస్తున్నారని సిగ్గేసి,
మబ్బు పరదాల మాటుకెల్లి
ముసిముసిగా నవ్వినట్టు..

ముదురు నీలిరంగు చీరకట్టి,
ముద్ద బంతిలా నువ్వు నవ్వుతుంటే,
అమ్మో చెలీ!
నీదెంత అందమే!!

యిక ఈ మాట అనక తప్పదు మరి,
చీరకు నువ్వందమా!
నీకు చీరందమా!

ఎవరికెవరందమైనా
నిను చుసిన కనులకు మాత్రం
రోజంతా ఆనందమే!..

ఓ అందమా!


ఈ లోకంలోని అందమంతా
ఓ రూపమై వస్తే అది నువ్వు!
ఆ అందాన్ని ఆరాధించడంలోనే
ఒకరు జీవితాన్ని గడిపేస్తే..
అది నేను!!