Google

Friday, December 29, 2006

నిన్ను చూస్తుంటే


నిన్ను చూస్తుంటే

యిన్నాళ్ళూ నా కళ్ళు వెతికిన అందం
కళ్ళ ముందున్నట్టుగానే వుంటుంది.

నువ్వు నవ్వుతుంటే
పరిమళాలు నిండిన విరులన్నీ
నా ఎదనిండా జల్లుతున్నట్టుగానే వుంటుంది.


మాట్లాడితేనో
అమృతాన్ని మోసుకొచ్చిన సన్నాయి నొక్కులేవో
నన్ను చేరుతున్నట్టుగానే వుంటుంది.

కానీ; మళ్ళీ నువ్వే
ఒక్కో సారి నువ్వలా చూస్తూంటే
నా జీవితంలో యింకెన్నో అందాలు విడిచి
అర్థం లేకుండా నీతో గడిపాననిపిస్తుంది.

నువ్వలా వెకిలిగా నవ్వుతుంటే
నేను మరిచిన భవిష్యత్తు
వెక్కిరిస్తున్నట్టనిపిస్తుంది.

యిక నీ మాటలో
చచ్చిన పామునే చంపినట్టు
ఎక్కడైనా నే బతికుంటే
పొడిచి పొడిచి చంపాలన్నట్లు
కసిగా పొడుస్తున్న కత్తి పోట్లేమో అనిపిస్తుంది.
ఎందుకిలా?
ఓసారి నా జీవితంలోవెలుగులు నింపిన దేవతలా
మరోసారి నా కళ్ళను పొడిచేసి
చీకట్లను మిగిల్చిన దెయ్యంలా
క్షణక్షణం మారిపోయే కడలిలా
మరుక్షణం నే సేదతీరే ఒడిలా
ఎందుకిలా మారతావ్?
నాకు నచ్చిన,నేను మెచ్చిన
నా ప్రేయసిలా ఉండరాదూ!


2 comments:

రాధిక said...

bhinnakoanaalu....baagacepparu.

Bolloju Baba said...

సోదరా,
బాగుంది. మంచి ఉపమానాలు, పదచిత్రాలు, పదభంధాలు ఉన్నాయి. థీము కూదా మంచిది.

చిన్న అనుమానం

యిక నీ మాటలో
చచ్చిన పామునే చంపినట్టు
ఎక్కడైనా నే బతికుంటే
పొడిచి పొడిచి చంపాలన్నట్లు
కసిగా పొడుస్తున్న కత్తి పోట్లేమో అనిపిస్తుంది.
ఎందుకిలా?
అనే చోట కొంచెం కవితాత్మ దెబ్బతిన్నట్లనిపించటం లేదూ?